Moviesద‌ర్శ‌కురాలు అవుతోన్న అఖిల్ హీరోయిన్‌..

ద‌ర్శ‌కురాలు అవుతోన్న అఖిల్ హీరోయిన్‌..

ప్ర‌ముఖ మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్రియ‌ద‌ర్శ‌న్ సీనియ‌ర్ హీరోయిన్ లిజిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంప‌తుల కుమార్తె క‌ళ్యాణి. ఇక ఆ త‌ర్వాత ప్రియ‌ద‌ర్శ‌న్‌, లిజి దంప‌తులు విడిపోయారు. త‌ల్లిదండ్రుల బాట‌లోనే క‌ళ్యాణి కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె తెలుగులో అక్కినేని అఖిల్ ప‌క్క‌న హ‌లో సినిమాలో కూడా న‌టించింది.

 

 

ఆ త‌ర్వాత తెలుగులో ఆమె ర‌ణ‌రంగం, చిత్ర‌ల‌హ‌రి సినిమాల్లో కూడా హీరోయిన్‌గా న‌టించింది. ఇక ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో కూడా క‌ళ్యాణి న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ఆంథాల‌జీ పుత్త‌మ్ పుదుకాలై సినిమాలో న‌టిస్తోంది. ఈ క‌థ‌లో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శి, ఊర్వ‌శి, కాళీదాస్ జ‌య‌రాం న‌టిస్తున్నారు. ఇల‌మై ఇదో ఇదో సినిమా షూటింగ్ మూడు రోజుల పాటు న‌డిచింద‌ని.. సెట్లో ఐదుగురు మాత్ర‌మే ఉండేవార‌ని… నా మేక‌ప్ నేనే వేసుకున్నాన‌ని చెప్పింది.

 

 

 

ఈ అనుభ‌వం త‌న‌కు వింత‌గా ఉంద‌ని.. తాను కూడా ఈ అనుభ‌వంతో తండ్రి లాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌న్న కోరిక‌తో ఉన్నాన‌ని చెప్పింది. ప్రియ‌ద‌ర్శ‌న్ తెలుగులో కూడా నాగార్జున‌కు నిర్ణ‌యం లాంటి హిట్ ఇచ్చాడు. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేశాడు. మ‌రి తండ్రి లాగా క‌ళ్యాణి మెగాఫోన్ ప‌ట్టుకుని ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news