Moviesడ్ర‌గ్స్ కేసులో ట్విస్ట్‌... సంజ‌నాకు నో రిమాండ్‌.. సెంట్ర‌ల్ జైలుకు రాగిణి

డ్ర‌గ్స్ కేసులో ట్విస్ట్‌… సంజ‌నాకు నో రిమాండ్‌.. సెంట్ర‌ల్ జైలుకు రాగిణి

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారం ఇప్పుడు అక్క‌డ సినిమా ప‌రిశ్ర‌మే కాదు రాజ‌కీయ రంగాన్ని కూడా ఓ కుదుపు కుదుపుతోంది. ఈ డ్ర‌గ్ ఇష్యూలో ప‌లువురు సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల పేర్లు, వారి పుత్ర ర‌త్నాల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ కేసులో ఇప్ప‌టికే ఇద్ద‌రు హాట్ హీరోయిన్లు సంజ‌నా గ‌ల్రానీ, రాగిణి ద్వివేది అరెస్టు అయ్యారు. ఇదిలా ఉంటే పోలీసులు ఈ కేసులో అరెస్టు అయిన రాగిణి ద్వివేదికి 14 రోజులు రిమాండ్ విధించ‌డంతో పాటు ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Sandalwood drug case: Kannada actor Ragini Dwivedi to remain in jail till  September 14 | IndiaToday

అయితే మ‌రో హీరోయిన్ సంజ‌న‌కు మాత్రం రిమాండ్ విధించ‌లేదు. ఆమెతో పాటు అరెస్టు అయిన రాహుల్, ప్రశాంత్‌ రంకా, లూమ్‌ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టులో హాజరు పరిచారు. నటి సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక సంజ‌న ఇప్ప‌టికే పలువురు బ‌డా బాబుల పేర్లు బ‌యట పెట్ట‌డంతో పాటు ఆమె ఆస్తులు చిట్టా చూసి పోలీసుల షాక్ అవ్వ‌డంతో ఆమె నుంచి మ‌రిన్ని వివ‌రాలు రాబట్టాల్సి ఉంద‌ని తెలుస్తోంది.

Bengaluru police take actor Sanjana Galrani into custody for questioning in  drug case | The News Minute

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news