Moviesనాని కామెంట్లు ఆ టాప్ హీరోల‌కేనా... అందుకే కార్న‌ర్ చేశాడా...!

నాని కామెంట్లు ఆ టాప్ హీరోల‌కేనా… అందుకే కార్న‌ర్ చేశాడా…!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన వి సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు అమోజాన్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో రిలీజ్ అయ్యింది. నాని, మ‌రో యంగ్ హీరో సుధీర్‌బాబు, హీరోయిన్లు నివేద‌, అదితిరావు హైద‌రీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇప్ప‌టికే మిక్స్ డ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్ర‌మోషన్ల‌లో నాని మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు టాలీవుడ్ టాప్ హీరోల‌ను కార్న‌ర్ చేసేవిగా ఉన్నాయ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

నాని నిన్న ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ కొంద‌రు టాప్ హీరోల‌ను కార్న‌ర్ చేస్తూ మాట్లాడాడ‌ని ఇండ‌స్ట్రీలో ప‌లువురు గుస్సా అవుతున్నారు. హీరోలు తాము చేసే సినిమాల వ‌ర‌కు త‌మ నిర్మాత‌ల‌కు న‌ష్టం రాకుండా చూసుకోవాల‌ని… ఈ బాధ్య‌త వారిదే అని చెప్పాడు. అలాగే త‌మ సినిమాకు న‌ష్టం వ‌స్తే హీరోలు త‌మ రెమ్యున‌రేష‌న్లు కూడా త‌గ్గించుకోవాల‌ని… ఒక వేళ నిర్మాత‌కు అప్ప‌ట‌కీ కూడా ఏం మిగ‌ల‌క‌పోతే హీరోలు జీరో పారితోష‌కం తీసుకోవాల‌ని చెప్పాడు.

నాని చేసిన ఈ డైలాగులు కొంద‌రు టాప్ హీరోల‌ను ఉద్దేశించి చేసిన‌వే అంటున్నారు. కొంద‌రు టాప్ హీరోలు సినిమా హిట్లు, ప్లాపుల‌తో సంబంధం లేకుండా త‌మ రెమ్యున‌రేష‌న్ల కోసం నిర్మాత‌ల‌ను జ‌ల‌గ‌ల్లా పీడిస్తున్నార‌న్న టాక్ ఉంది. ఇప్పుడు నాని కూడా ఆ టాప్ హీరోల‌ను టార్గెట్ చేస్తూనే ఈ డైలాగ్ వేశార‌ని కొంద‌రు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news