టాలీవుడ్ హాట్ టాపిక్‌గా ప‌‌వ‌న్ సినిమ రాజ‌కీయం..!

సినిమా, రాజ‌కీయ రంగాలు అంటేనే వ‌ర్గ పోరులు, ఆధిప‌త్య పోరుకు పెట్టింది పేరు. అయితే జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం వీటికి కాస్త దూరంగా సింపుల్‌గానే ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఏ విష‌యంలోనూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు.. కామెంట్లు చేయ‌రు. అయితే ప‌వ‌న్ త‌న తాజా బ‌ర్త్ విష‌యంలో మాత్రం వ్య‌వ‌హ‌రించిన తీరుతో ప‌వ‌న్ పూర్తిగా మారిపోయాడ‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా త‌న‌కు విష్ చేసిన రాజ‌కీయ‌, సినిమా సెల‌బ్రిటీల‌కు ప్ర‌తి ఒక్క‌రికి స్పందించారు.

ప‌వ‌న్ ఇలాంటి పొగ‌డ్త‌ల‌కు దూరంగా ఉండ‌డంతో పాటు వీటిని పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. త‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే విషెస్ చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డంతో పాటు ఎవ‌రికి వారికి విడిగా వారి పేరుతో స‌హా కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌వ‌న్ ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఇలా రిప్లే ఇవ్వ‌డంపై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

అయితే సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా అక్కౌంట్లు నిర్వ‌హించేందుకు కొంద‌రిని నియ‌మించుకుంటారు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త సిబ్బంది ఈ ప‌ని చేశార‌ని అనుకున్నా.. ప‌వ‌న్ నుంచి ఆదేశాలు లేనిదే వారు ఇలా చేయ‌రు. అయితే ప‌వ‌న్ ఇలా రియాక్డ్ కావ‌డం వెన‌క ఏదో బ‌ల‌మైన కార‌ణం అయితే ఉంద‌ని ప్ర‌తి ఒక్క‌రు అనుకుంటున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ జ‌న‌సేన నుంచి పోటీ చేసినా ఇండ‌స్ట్రీ నుంచి పెద్ద‌గా స‌పోర్ట్ లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ మంది జ‌గ‌న్‌కే మ‌ద్ద‌తు ఇచ్చారు. మ‌రి ఇప్పుడు త‌న‌కు రాజ‌కీయంగా కూడా ఇండ‌స్ట్రీ స‌పోర్ట్ కోస‌మే అంద‌రిని క‌లుపుకుంటున్నారా ?  లేదా ?  వేరే ఎజెండా ఉందా ? అన్న‌ది ప‌వ‌న్‌కే తెలియాలి.