Politicsఈ నీచుడి లీల‌లు అన్ని ఇన్నీకాదు.. ప్రేమ‌పేరుతో వ‌ల‌... ఏడుగురు అమ్మాయిల‌కు...

ఈ నీచుడి లీల‌లు అన్ని ఇన్నీకాదు.. ప్రేమ‌పేరుతో వ‌ల‌… ఏడుగురు అమ్మాయిల‌కు న‌ర‌కం

పైకి పెద్ద షో మాస్ట‌ర్. వేసే దుస్తులు, చెప్పుల నుంచి అన్నీ కాస్ట్‌లీవే. బ‌డా రాజ‌కీయ నేత‌ల పేర్ల‌తో విఐపీ సుఖాలు పొందుతూ ఉంటాడు. మ‌నోడి పొజుల‌కు చాలా మంది అమ్మాయిలు ప‌డిపోతారు. ఆ త‌ర్వాత అత‌డి వికృత క్రీడ మొద‌ల‌వుతుంది. కొన్నేళ్లుగా అత‌డి అరాచ‌కాల‌కు అడ్డే లేదు. ఈ కామాంధుడి అకృత్యాలు ఎట్ట‌కేల‌కు ఓ 16 ఏళ్ల అమ్మాయి బ‌య‌ట పెట్టింది. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

CardiologyToo? Sexual Harassment Also Infects Hospital Corridors and the  Cath Lab | tctmd.com

సాత్నా జిల్లా కేంద్రానికి చెందిన మొహ్మద్ అతీఖ్ మన్సూరి (40) అనే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. మ‌నోడు గ‌త కొంత కాలంగా అమ్మాయిల‌ను వ‌ల‌లో వేసుకుని వారిపై అత్యాచారం చేస్తున్నాడు. కొంద‌రికి డ‌బ్బు ఆశ‌తో.. కొంద‌రిని ప్రేమ పేరుతో లొంగ‌దీసుకుని వారిపై అత్యాచారం చేయ‌డంతో పాటు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు. చివ‌ర‌కు 16 ఏళ్ల మైన‌ర్ బాలిక‌ను కూడా ప్రేమ పేరుతో లోబ‌ర‌చుకుని రెండేళ్లుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు.

6 ways to prevent sexual harassment in the workplace - Leading Edge  Magazine - Leading Edge Magazine

ఏడుగురు మ‌హిళ‌ల‌ను వీడియోల‌తో బెదిరించి న‌ర‌కం చూపిస్తోన్న మ‌న్సూరి ఈ మైన‌ర్ బాలిక‌ను కూడా తీవ్రంగా వేధించాడు. దీంతో ఆమె ధైర్యం చేసి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. పోలీసులు అత‌డిన అదుపులోకి తీసుకుని విచారించ‌గా అత‌డి లీల‌లు వెలుగులోకి వ‌చ్చాయి. మన్సూరీ బాధిత జాబితాలోని ఏడుగురు మహిళల్లో ఒకరిని అతను పెళ్లి కూడా చేసుకుని, కొంతకాలానికి వదిలేశాడని వెల్లడైంది. బీజేపీ మాత్రం ఇది ల‌వ్ జీహాద్ అంటున్నా పోలీసులు మాత్రం కొట్టి ప‌డేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news