Moviesప‌వ‌న్ స్నేహితుడు కోసం బాల‌య్య ల‌వ‌ర్ హాట్ హాట్‌గానేనా..!

ప‌వ‌న్ స్నేహితుడు కోసం బాల‌య్య ల‌వ‌ర్ హాట్ హాట్‌గానేనా..!

బాలీవుడ్ కండ‌ల వీరుడు ఐశ్వ‌ర్యారాయ్‌తో విడిపోయాక ఆమె పోలిక‌ల‌తోనే ఉన్న కొంద‌రిని హీరోయిన్లుగా చేశాడు. ఈ లిస్టులో స్నేహ ఉల్లాల్ కూడా ఒక‌రు. స్నేహ అచ్చు గుద్దిన‌ట్టు ఐశ్వ‌ర్య‌లా ఉంటుంద‌న్న చ‌ర్చ న‌డిచింది. సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో ఆమెను అంద‌రూ మినీ ఐశ్వ‌ర్యారాయ్ అని పిలిచేవారు. క‌రెంట్ సినిమాతో త‌ళుక్కున మెరిసినా ఆ త‌ర్వాత సింహా సినిమాలో ఆమె రెండో బాల‌య్య ప‌క్క‌న ల‌వ‌ర్‌గా ఇర‌గ‌దీసింది. ప్రొఫెస‌ర్‌గా ఉన్న బాల‌య్య‌నే లైన్లో ప‌డేసే సీన్ల‌లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సూప‌ర్బ్‌.

ఆ త‌ర్వాత ఆమె తెలుగుతో పాటు, త‌మిళ్‌, క‌న్న‌డ సినిమాల్లో కూడా న‌టించింది. ఆ త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో ఛాన్సులు లేకుండా పోయాయి. చివ‌ర‌కు ఆఫ‌ర్లు త‌గ్గిపోయాయి. కొద్ది రోజులుగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్న స్నేహ త్వ‌ర‌లోనే ఎక్స్పైరీ డేట్ వెబ్ సీరిస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కే ఈ వెబ్ సీరిస్‌లో ఆమె హాట్ గా క‌నిపించ‌నుంద‌ట‌. ఈ వెబ్ సీరిస్ రెడీ అయ్యి జూన్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల‌నుకున్నా క‌రోనా దెబ్బ‌తో బ్రేక్ ప‌డింది.

ఇక ఈ వెబ్ సీరిస్‌ను పవన్ కళ్యాణ్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మించాడు. శంకర్ మార్తాండ్ డైరెక్ట్ చేశాడు. భార్య‌ను చంపి వ్య‌క్తి జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఇది తెర‌కెక్కింది. మ‌రి వెబ్ సీరీస్‌లో హాట్‌గా ఎంట్రీ ఇస్తోన్న స్న‌హ‌కు ఇక్క‌డైనా ల‌క్ చిక్కుతుందేమో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news