Gossipsబాల‌య్య - బోయ‌పాటి BB3 టైటిల్‌, హీరోయిన్‌... రెండు గుడ్ న్యూస్‌లు...

బాల‌య్య – బోయ‌పాటి BB3 టైటిల్‌, హీరోయిన్‌… రెండు గుడ్ న్యూస్‌లు మీకోసం..

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో బీబీ3 అనే వర్కింగ్ టైటిల్‌ పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యి బాల‌య్య అభిమానుల‌కు కావాల్సిన యాక్ష‌న్ అందించేసింది. మ‌రోసారి సింహా, లెజెండ్ రేంజ్‌లో ఈ సినిమా ఉంటుంద‌ని టీజ‌ర్ చెప్ప‌క‌నే చెప్పేసింది. ఈ సినిమా గురించి రెండు అదిరిపోయే అప్‌డేట్స్ టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమాకు ఇప్ప‌టికే ప‌లు టైటిల్స్ అనుకుంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఇక తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌లో ఓ హీరోయిన్‌గా తెలుగు అమ్మాయి అంజ‌లి ఎంపికైంద‌ని అంటున్నారు. గ‌తంలో బాల‌య్య – అంజ‌లి డిక్టేట‌ర్ సినిమాలో న‌టించారు. మ‌రోసారి ఈ తెలుగు అందంతో బాల‌య్య జోడీ క‌ట్ట‌నున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యిందని.. మోనార్క్ పేరుతో ఈ సినిమా రాబోతుందని అన్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం సూప‌ర్‌మ్యాన్ టైటిల్ వైపు బోయ‌పాటి మొగ్గు చూపుతున్నాడ‌ని అంటున్నారు.

గ‌తంలో సూప‌ర్ మ్యాన్ టైటిల్‌తో ఎన్టీఆర్ సినిమా చేశారు. ఇక ఇప్పుడు ఈ క‌థ‌కు కూడా సూప‌ర్ మ్యాన్ టైటిల్ ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోతుందంటున్నారు. మ‌రి సూప‌ర్ మ్యాన్ అంటే యాక్ష‌న్ నేప‌థ్యంలో క‌థ ఉండాలి. ఈ టైటైల్ ఖ‌రారు చేస్తారా ?   లేదా ? అన్న‌దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news