Newsఎస్బీఐలో దారుణం... ఖాతాదారుల అక్కౌంట్ల నుంచి డ‌బ్బులు మాయం

ఎస్బీఐలో దారుణం… ఖాతాదారుల అక్కౌంట్ల నుంచి డ‌బ్బులు మాయం

ఎస్బీఐలో ఖాతాదారుల ఖాతాల నుంచి డబ్బులు మాయం అయ్యాయి. బ్యాంక్ మేనేజర్ చేతివాటంతో క‌స్ట‌మ‌ర్ అక్కౌంట్ల‌ నుంచి ఏకంగా రు. 3 కోట్లు మాయం అయ్యాయి. మొత్తం 49 ఖాతాల నుంచి డ‌బ్బు మళ్లించిన‌ట్టు ఆర్థిక నేరాల ప‌రిశోధ‌న‌లో తేలింది. ఈ ఘ‌ట‌న ఇండోర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సియాగంజ్ బ్రాంచ్‌లో జ‌రిగింది. మేనేజ‌ర్ శ్వేతా దారువాల‌తో పాటు మ‌రో ఉద్యోగి కౌస్తుబ్ సింగారేపై మోసం, ఫోర్జ‌రీ కేసులు న‌మోదు అయ్యాయి.

గ‌త కొంత కాలంగా ఖాతాదారులు త‌మ అక్కౌంట్ల‌లో జ‌మ చేస్తోన్న డ‌బ్బులు ఖాతాల్లో చేర‌క‌పోవ‌డం గుర్తించిన ప‌లువురు ఖాతాదారులు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్థిక నేరాల ప‌రిశోధ‌న సెల్ రంగంలోకి అస‌లు దొంగ‌లు బ్యాంకులోనే ఉన్న‌ట్టు గుర్తించారు. బ్యాంక్ మేనేజ‌ర్ న‌గ‌దు జ‌మ చేసేందుకు వ‌చ్చిన ఖాతాదారుల నుంచి డ‌బ్బు తీసుకుని వేరే ఖ‌తాల‌కు బ‌దిలీ చేస్తూ వ‌చ్చారు. మొత్తం 49 ఖాతాల నుంచి రు. 3 కోట్లు దారి మల్లించేశారు.

ఇక ఇక్క‌డ నుంచి మోసం చేసి తీసుకున్న డ‌బ్బును వివిధ బ్రాంచ్‌ల‌కు చెందిన ఖాతాల్లో జ‌మ‌చేశారు. అలాగే రుణాలు తీసుకున్న వ్యక్తులు ఇచ్చిన పత్రాలను ఉపయోగించి రెండో సారి రుణాలను మంజూరు చేసినట్లు ఈవోడబ్ల్యూ వెల్లడించింది. దాంతో బ్యాంకు మేనేజర్ శ్వేతా దారువాలాతోపాటు ఉద్యోగి కౌస్తుబ్ సింగారేపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news