మ‌రో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేల‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌

ఏపీలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్ప‌టికే 5.27 ల‌క్ష‌లు దాటేసింది. ఇక ఇప్ప‌టికే 4600 మంది మృతి చెందారు. ఇక ఇప్ప‌టికే అధికార వైఎస్సార్‌సీపీతో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు కోవిడ్ భారీన ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు కోవిడ్ భారీన ప‌డ్డారు. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డితో పాటు తూర్పు గోదావ‌రి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా క‌రోనా భారీన ప‌డ్డారు.

 

ఇక మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే తండ్రి దశరాథరామిరెడ్డి కొద్దిరోజుల క్రింద‌ట‌ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్కే మంగళవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఇక ఆయ‌న 14 రోజుల పాటు హోమ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్ల‌డంతో పాటు త‌న‌ను క‌లిసిన వారు కూడా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. ఇక దాడిశెట్టి రాజాకు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందటానికి తాను విశాఖపట్నానికి వెళ్లినట్లు రాజా చెప్పారు.