Moviesరియాకు మ‌ద్ద‌తుగా టాప్ ద‌ర్శ‌కుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. విల‌న్‌ను చేసి వెంటాడుతున్నారు...

రియాకు మ‌ద్ద‌తుగా టాప్ ద‌ర్శ‌కుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. విల‌న్‌ను చేసి వెంటాడుతున్నారు…

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి చుట్టూనే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. కంగ‌నా ర‌నౌత్ నుంచి, సుబ్ర‌హ్మ‌ణ్య స్వామితో పాటు ఎంతో మంది సామాన్యులు సైతం రియాను త‌ప్పుప‌డుతున్నారు. అటు సుశాంత్ తండ్రి కెకె. సింగ్ సైతం రియా చ‌క్ర‌వ‌ర్తిపై ప‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇక బ‌య‌ట రియాను ఆడుకునే వాళ్లు… మీడియా.. సోష‌ల్ మీడియా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు చాలా మంది మ‌గ పుంగువ‌లు అమ్మాయిల‌పై ఉన్న చుల‌కన భావాన్ని రియా మీద రుద్దుతున్నార‌ని ఆమెకు స‌పోర్ట్ చేసేవాళ్లు మాట్లాడుతున్నారు. ఇక సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ సైతం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతూ రియాను విల‌న్ ను చేసి వెంటాడుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

రియాను దోషిగా తేల్చేసి మాట్లాడుతున్న వాళ్ల‌లో చాలా మందికి అస‌లు అక్క‌డ ఏం జ‌రిగింది అన్న‌ది తెలియ‌ద‌ని.. ఏదో దొరికింది క‌దా ? అని ఆమెపై నోరు పారేసుకునే వాళ్లే ఎక్కువ మంది ఉన్నార‌ని చెప్పారు. ఇక మీడియా, సోష‌ల్ మీడియా ఏదైనా రియా సుశాంత్‌ను మాన‌సికంగా వేధిస్తుంద‌ని ఎవ‌రు అయితే చెపుతున్నారో.. ఇప్పుడు వాళ్లంతా కూడా ఆమెను అదే చేస్తున్నార‌ని రాము త‌న‌దైన స్టైల్లో చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news