Gossipsనాని V సినిమా ట్రైల‌ర్‌పై ట్రోలింగ్‌

నాని V సినిమా ట్రైల‌ర్‌పై ట్రోలింగ్‌

స‌హ‌జంగా ఏ సినిమా ట్రైల‌ర్ అయినా రిలీజ్ అయ్యాక బాగుంద‌నో లేదా బాగోలేద‌నో చ‌ర్చ న‌డుస్తుంది. స‌హ‌జంగా ఓ హీరో సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయితే యాంటీ ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రోల్ చేస్తారు. వీరు ట్రైల‌ర్ బాగున్నా.. బాగోలేక‌పోయినా కూడా ట్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ చిత్ర విచిత్రంగా నాని వీ సినిమా ట్రైల‌ర్ వ‌ద‌ల‌డంపై  ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇందుకు అమోజాన్ ప్రైమ్ చేసిన ఓ ప్ర‌యోగ‌మే ఇందుకు కార‌ణం. సినిమాపై ఆస‌క్తి క్రియేట్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ మీరే ట్రైల‌ర్ రిలీజ్ చేయండి.. ఇందుకు మీరు ఓ విక్ట‌రీ సింబ‌ల్ తీసుకుని అప్‌లోడ్ చేస్తే చాల‌ని ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

 

వీరు సైట్లోకి వెళ్లి అక్క‌డ చెప్పిన‌ట్టు చేస్తే స‌రిపోతుంది. అయితే ఇక్క‌డే వి సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తోన్న అభిమానుల‌కు చిర్రెత్తుకొచ్చింది. ఓ టైం ప్ర‌క‌టించి.. ఆ టైంకు ట్రైల‌ర్ రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌కటిస్తే.. ఆ ఆస‌క్తి వేరేగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఓ ప్రొసీజ‌ర్ ప్ర‌క‌టించి వీ సింబ‌ల్తో సెల్ఫీలు అనేస‌రికి ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేసింది. దీంతో వారు అమోజాన్ ఫ్రైం ట్విట్ట‌ర్ అక్కౌంట్ కింద రెచ్చిపోయి కామెంట్లు, మీమ్స్ చేస్తూ ట్రోలింగ్ షురూ చేశారు.

 

అయితే ఇదంతా నాని ఫ్యాన్స్ ట్రోలింగ్ మాత్ర‌మే కాదు.. యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కూడా అని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కిన నాని వి సినిమా మొత్తానికి ఓటీటీ రిలీజ్‌కు ముందు మంచి బ‌జ్ అయితే తెచ్చుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news