Gossipsరామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ అవ‌కాశాల కోసం ఇంత‌కు దిగ‌జారిందా..!

రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ అవ‌కాశాల కోసం ఇంత‌కు దిగ‌జారిందా..!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ తొలి సినిమా చిరుత హీరోయిన్ నేహా శ‌ర్మ చాలా మందికి గుర్తుండక‌పోవ‌చ్చు. చ‌ర‌ణ్‌తో చిరుతు చేసిన ఆమెకు ఆ త‌ర్వాత ఎలాంటి పెద్ద హీరో కూడా ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత కొన్ని హాట్ హాట్ ఫొటో షూట్‌లు ఇచ్చుకుంటూ కాలం గ‌డుపుతోంది. బీచ్‌ల్లో ఆమె ఆర‌బోసే అందాల‌కు అడ్డూ అదుపులేదు. ఎన్ని చేసినా కూడా ఆమెకు ఛాన్సులు అయితే రావ‌డం లేదు. తాజాగా ఆమెకు సంబంధించి కొన్ని హాట్ స్టిల్స్ వైర‌ల్ అయ్యాయి.

 

వ‌య‌స్సు పైబ‌డ‌డంతో ఆమె షేప్ కూడా పూర్తిగా ఫేడ‌వుట్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఆమె ఇప్పుడు మ‌రీ బ‌రితెగించేసి త‌న హాట్ ఫొటోల‌ను బ‌య‌ట‌కు వ‌దులుతోంది. ఈ ఫొటోల‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. నేహ ఇప్ప‌టికే చాలా చూపించేశావు.. ఇంక నువ్వు చూపించినా చూడ‌డానికి.. నీకు ఛాన్సులు ఇవ్వ‌డానికి ఇక్క‌డ ఎవ్వ‌రూ సిద్ధంగా లేర‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

 

ఇక తెలుగులో చ‌ర‌ణ్ ప‌క్క‌న చిరుతు చేసిన నేహ ఆ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్‌తో కుర్రాడు సినిమా చేసింది. అప్ప‌టి నుంచి ఆమెకు ఛాన్సులు లేవు. ఆ త‌ర్వాత క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి వెళ్లినా కూడా అక్క‌డా ఆమెను ప‌ట్టించుకోలేదు. ఏదేమైనా ఒకే ఒక్క ఛాన్స్ కోసం నేహ ప‌డుతోన్న క‌ష్టాలు మామూలుగా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news