Politicsముస్లిం దేశ క‌రెన్సీపై వినాయ‌కుడి బొమ్మ‌.. ఏ దేశ‌మో తెలుసా...!

ముస్లిం దేశ క‌రెన్సీపై వినాయ‌కుడి బొమ్మ‌.. ఏ దేశ‌మో తెలుసా…!

ప్ర‌పంచ వ్యాప్తంగా వినాయ‌క‌చవితి ఉత్స‌వాలు వైభ‌వంగా మొద‌ల‌య్యాయి. ఒక్క భార‌త‌దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో గ‌ణ‌నాథుడికి పూజ‌లు చేస్తారు. న‌వ‌రాత్రులు ఎంతో వైభ‌వంగా జ‌రుగుతూ ఉంటాయి. అయితే తాజాగా వినాయ‌కుడికి ఓ ముస్లిం దేశంలో అరుదైన గౌర‌వం ల‌భించింది. ఇండేనేషియా అధికారిక క‌రెన్సీపై వినాయ‌కుడి బొమ్మ‌ను ముద్రించారు. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఇండోనేషియా క‌రెన్సీపై ఓ హిందూ దేవుడి బొమ్మ ముద్రించ‌డం అంటే చాలా గొప్ప విష‌య‌మే అనుకోవాలి.

 

ఇక ఇండోనేషియా మ‌న సంస్కృతికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఇండోనేషియా కరెన్సీని రూపయ్య అంటారు. ఇక్కడ 20 వేల నోటుపై గణేశుడి చిత్రం ఉంటుంది. ఈ ముస్లిం దేశంలో గణేశుడిని విద్య కళ మరియు విజ్ఞాన దేవుడిగా భావిస్తారు. ఈ దేశ జ‌నాభాలో హిందువుల జ‌నాభా కేవ‌లం 3 శాతం మాత్ర‌మే. అయితే ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్క‌డ హిందువులు, హిందూ దేవ‌త‌ల ఆరాధ్యం ఎక్కుడుగా ఉంది. 1998 సంవత్సరంలో ఆ దేశంలో 20 వేల రూపాయల కొత్త నోట్లను ముద్రించారు.

 

అప్పుడు గ‌ణేశుడి ఫొటో తొల‌గించారు. అప్పుడు ఇండోనేషియా ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌ట్టాలు త‌ప్ప‌డంతో మ‌ళ్లీ గ‌ణేశుడి బొమ్మ‌తో కొత్త రు. 20 వేల నోట్లు జారీ చేయ‌డం స్టార్ట్ చేశారు. దీంతో త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ గాడిన ప‌డుతుంద‌న్న‌దే వీరి న‌మ్మ‌కం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news