Moviesనాని V సినిమాలో ఆ ఒక్క‌ రోల్‌తో మైండ్ బ్లోయింగే..!

నాని V సినిమాలో ఆ ఒక్క‌ రోల్‌తో మైండ్ బ్లోయింగే..!

నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కాంబినేష‌న్లో మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన వీ సినిమా సెప్టెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. స‌స్పెన్స్ క్రైం థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అస‌లు థియేట‌ర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కాస్త క‌రోనా నేప‌థ్యంలో చివ‌ర‌కు అమోజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా వెబినార్‌లో ప్రేక్ష‌కుల‌తో మాట్లాడిన హీరోయిన్ నివేద థామ‌స్ ఈ సినిమా గురించి ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.

వీ అంటే మీనింగ్ ఏంట‌నేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంద‌ని.. ఈ సినిమాలో తాను అపూర్వ అనే క్రైమ్ నవలా రచయిత పాత్రలో కనిపిస్తాన‌ని చెప్పింది. అలాగే ఈ పాత్ర విష‌యంలో తాను క‌థ చెప్ప‌గానే క‌నెక్ట్ అయ్యాన‌ని.. అపూర్వ పాత్ర ఎంత ఓబీడీయెంట్‌గా ఉంటుందో అంతే డేరింగ్.. కాన్ఫిడెంట్‌గా ఉంటుద‌ని చెప్పింది. ఓవ‌రాల్‌గా నివేద రోల్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంద‌ట‌.

ఇక టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌ను చూస్తుంటు నాని రోల్ నెగిటివ్ షేడ్‌లో ఉంద‌ని.. అయితే అస‌లు నాని పాత్ర నిజంగానే నెగిటివ్ షేడ్‌లో ఉంటుందా ? అన్న‌ది ఇప్పుడే తాను చెప్ప‌న‌ని స‌స్పెన్స్‌లో పెట్టారు. ఇక నానితో త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని.. నాని కేవ‌లం సినిమాల్లోనే కాకండా నిజజీవితంలోనూ నాకు మంచి మిత్రుడు అయ్యాడ‌ని నివేద చెప్పుకొచ్చింది. నాకు ఏదైనా కథ నచ్చితే.. తనతో డిస్కస్ చేస్తుంటాను. అలాగే తన సినిమాల్లోని పాత్రలు గురించి నాతో డిస్కస్ చేస్తుంటాడ‌ని నివేద తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news