Moviesఅన‌సూయ ఒంటిపై టాటూకు మీనింగ్ అదా... వామ్మో ఎంత అర్థం ఉందా...!

అన‌సూయ ఒంటిపై టాటూకు మీనింగ్ అదా… వామ్మో ఎంత అర్థం ఉందా…!

ఒంటిపై సెల‌బ్రిటీలు టాటూలు వేయించుకోవ‌డం కామ‌న్‌. ఈ విష‌యంలో హీరోల కంటే హీరోయిన్లు టాటూలు వేసుకుంటే ఆ క్రేజ్‌..ఆ అంద‌మే వేరు. ఇక హీరోయిన్లు చాలా గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తూ శ‌రీరంపై బొడ్డు నుంచి వీపు, నాభి ఇంకా చాలా చాలా చోట్ల టాటూలు వేయించుకుంటూ ఉంటారు. ఇక హాట్ యాంక‌ర్ అన‌సూయ సైతం త‌న మ‌ణిక‌ట్టుపై టాటూ వేయించుకుంది. ఆ ప‌చ్చ‌బొట్టుకు చాలా మీనింగ్ ఉంద‌ట‌. ఈ విష‌యం ఆమే చెప్పింది.

బాహ్య సౌంద‌ర్యం కంటే ఆత్మ సౌంద‌ర్యం గొప్ప‌ది అని చెప్ప‌డానికే ఖేల‌న్ అనే ప‌దం వాడ‌తారు అట‌. గ్రీకు మైథాల‌జీలో ఖేల‌న్ అనే ప‌దాన్ని అంతః సౌంద‌ర్యం కోసం వాడ‌తారు. దీనిని బ‌ట్టి అన‌సూయ కూడా బాహ్య సౌంద‌ర్యం కంటే ఆత్మ‌సౌంద‌ర్యం గొప్ప‌ద‌ని చెప్పేందుకే ఈ ప‌దం ప‌చ్చ‌బొట్టుగా వేయించుకుంద‌ట‌. ఇక తాను డ‌బ్బుల కోస‌మే సినిమాలు చేయ‌డం లేద‌ని.. త‌న‌కు వ‌చ్చే డ‌బ్బంతా బుల్లితెర షోల నుంచే వ‌స్తోంద‌ని.. త‌న‌లో మ‌రో యాంగిల్ కోస‌మే సినిమాలు చేస్తున్నాని అన‌సూయ తెలిపింది.

ఇక తాను ఎక్స్‌పోజింగ్‌, గ్లామ‌ర్ పండించ‌డం ద్వారానే టీవీల్లో నెట్టుకు వ‌స్తున్నాన‌ని విమ‌ర్శ‌లు చేసే వారికి ఆన్స‌ర్ చేసేందుకే తాను సినిమాలు చేస్తూ త‌నలో టాలెంట్ బ‌య‌ట పెడుతున్నానంటూ ఘాటైన స‌మాధానం ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news