Moviesనిత్యానంద కైలాసానికి వెళ్లాల‌నుకుంటున్నా... కాంట్ర‌వ‌ర్సీ హీరోయిన్ కోరిక‌

నిత్యానంద కైలాసానికి వెళ్లాల‌నుకుంటున్నా… కాంట్ర‌వ‌ర్సీ హీరోయిన్ కోరిక‌

నిత్యానంద ఎక్క‌డ ఉన్నాడో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఈక్వెడార్‌కు చెందిన ఓ దీవిని నిత్యానంద కొనుగోలు చేసి దానికి కైలాస దేశం అని పేరు పెట్టుకోవ‌డ‌డంతో పాటు దానికి ఆయ‌నే రాజు అని ప్ర‌క‌టించుకోవ‌డంతో పాటు ప్ర‌త్యేక క‌రెన్సీ, ప్ర‌త్యేక రాజ‌ధాని పెట్టుకుని తన‌కు తాను పాల‌న చేస్తున్నాన‌ని చెప్పుకుంటున్నారు. ఇక నిత్యానంద త‌న కైలాస దేశంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కొంద‌రిని ఆహ్వానిస్తుండ‌డంతో కొంద‌రు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు వ‌స్తోన్న వార్త‌లు కూడా సంచ‌ల‌నంగా మారాయి.

Bigg Boss' Tamil contestant Meera Mithun dropped from 'Agni Siragugal' |  The News Minute

ఇదిలా ఉంటే తాను నిత్యానంద కైలాస దేశానికి వెళ్లాల‌నుకుంటున్న‌ట్టు వివాదాస్ప‌ద న‌టి మీరామిథున్‌ పేర్కొన్నారు. కోలీవుడ్‌కు చెందిన ఈ వివాదాస్ప‌ద న‌టి ఇప్ప‌టికే ప‌లు వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో కోలీవుడ్ పెద్ద‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. తాజాగా ఆమె దృష్టి నిత్యానంద‌పై ప‌డింది. మీరామిథున్‌ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో చెపుతూ అంద‌రూ ఆయ‌న్ను త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్నారు.. తాను త్వ‌ర‌లోనే నిత్యానంద కైలాస దేశాన్ని సంద‌ర్శిస్తాన‌ని.. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ అని మీరా మిథున్‌ పేర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news