బ్రేకింగ్‌: మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు సామాన్యులు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు అంద‌రూ విల‌విల్లాడుతున్నారు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కులు బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఉండ‌డంతో వీరు త్వ‌ర‌గా క‌రోనా భారీన ప‌డుతున్నారు. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ప‌లువురు ఎమ్మెల్యేలు క‌రోనా భారీన ప‌డుతున్నారు. ఇక దేశ్యాప్తంగా కొంద‌రు మంత్రులు, మాజీ మంత్రులు సైతం క‌రోనాకు గుర‌య్యి మృతి చెందుతున్నారు.

Union Minister Krishan Pal Gurjar tests positive for Covid-19 | Deccan  Herald

తాజాగా మ‌రో కేంద్ర మంత్రి సైతం క‌రోనా భారీన ప‌డ్డారు. కేంద్ర సామాజిక, న్యాయ శాఖా స‌హాయ మంత్రి క్రిష‌న్ పాల్ గుర్జ‌ర్ (63)కు క‌రోనా పాజిటివ్ సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం డాక్ట‌ర్ల సూచ‌న‌ల మేర‌కు క్రిష‌న్ పాల్ సెల్ప్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఇక ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌రోనా టెస్టులు చేస్తున్నారు. ఇప్ప‌టికే కేంద్ర మంత్రులు అమిత్ షా, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌, శ్రీపాద నాయ‌క్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Leave a comment