Moviesఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫ్యీజులు ఎగిరిపోయే న్యూస్‌.. పండ‌గ చేస్కోండి

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫ్యీజులు ఎగిరిపోయే న్యూస్‌.. పండ‌గ చేస్కోండి

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా మ‌రో యేడాది ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే సినిమాలో న‌టించ‌నున్నాడు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్త‌వుతాయో తెలియ‌కుండానే ఎన్టీఆర్ కోసం మ‌రికొంత మంది డైరెక్ట‌ర్లు క్యూలో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుకు క‌ళ్యాణ్‌రామ్ – చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ క‌థ‌ను లాక్ చేశాడు. ఇక  ఈ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రు అయిన సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఓ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ నుంచి కొత్త సినిమా అప్‌డేట్స్ ఇవ్వాల‌ని సందేశాలు వ‌స్తున్నాయని… షూటింగ్ ప్రారంభ‌మైన వెంట‌నే ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్స్ ఇస్తామ‌ని నాగ‌వంశీ చెప్పాడు.

ఇక ఈ సినిమా టైటిల్ గురించి ప్ర‌స్తావిస్తూ టైటిల్ ముందుగానే రివీల్ చేయ‌కూడ‌ద‌న్న సెంటిమెంట్ మాకు లేద‌ని.. మీకు త్వ‌ర‌లోనే అదిరిపోయే బిగ్‌న్యూస్ అందించేందుకు మేం రెడీగా ఉన్నామ‌ని నాగ‌వంశీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఏదేమైనా క‌రోనా త‌గ్గి షూటింగ్‌లు ప్రారంభ‌మైన వెంట‌నే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్స్ రివీల్ కానున్నాయి. ఇక వంశీ ట్వీట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ సూప‌ర్ అప్‌డేట్స్  ఎప్పుడు వ‌స్తుందా ? అని సోష‌ల్ మీడియా చ‌ర్చ‌ల్లో మునిగారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news