Gossipsఉమా వ్యూహం టీడీపీకి ప్ల‌స్ అయ్యిందే..!

ఉమా వ్యూహం టీడీపీకి ప్ల‌స్ అయ్యిందే..!

దేవినేని ఉమా…టీడీపీలో అత్యంత కీలక నాయకుడు. కృష్ణా జిల్లాలో పార్టీ కోసం నిరంతరం కష్టపడే నేత. నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన ఉమా…2019 ఎన్నికల్లో జగన్ గాలిలో తొలిసారి ఓటమిని చవిచూశారు. మైలవరం నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తొలిసారి ఓటమి వచ్చినా ఏ మాత్రం క్రుంగిపోకుండా ఏడాది కాలంలోనే మొత్తం సెట్ చేసేసుకున్నారు. నియోజకవర్గంలో తానే ప్రజలకు సరైన అండని రుజువు చేసుకున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే వసంత అనుహ్యాంగా ఫెయిల్ అవ్వడం, ఉమా నిరంతరం ప్రజలకు సపోర్ట్‌గా ఉండటంతో మైలవరం నియోజకవర్గంలో టీడీపీ ఒక్కసారిగా పుంజుకుంది. అసలు టీడీపీ  పుంజుకోవడాని ప్రధాన కారణం అమరావతి. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల దెబ్బ వసంత మీద గట్టిగానే పడింది. ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని పెద్ద పెద్ద డైలాగులువేసి వసంత గెలిచారు. కానీ గెలిచాక మూడు రాజధానుల అంటే ఏం మాట్లాడకుండా ఉంటున్నారు. ఇదే సమయంలో ఉమా అమరావతి కోసం గట్టిగానే పోరాడుతున్నారు. రైతులకు అండగా ఉంటున్నారు.

పైగా అమరావతి పక్కనే ఉండటం వల్ల మైలవరం ప్రజలు మూడు రాజధానులని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు సైతం రాజధాని ప్రభావం ముందు కొట్టుకుపోయాయి. దీని వల్ల ఉమా ఆటోమేటిక్‌గా పికప్ అయ్యారు. పైగా వసంత అవినీతి, అక్రమాలని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వసంత అనుచరులు, ఆయన బంధువుల అక్రమ మైనింగ్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ దీనిని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళుతున్నారు.

దీనికితోడు వసంత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమ‌లు కాక‌పోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ ఆరోపణలతో పాటు నియోజకవర్గంలో కొత్తగా జరిగే అభివృద్ధి ఏమి లేదు. దీంతో ఏడాదిలోనే వసంత తీవ్ర వ్యతిరేకిత మూటగట్టుకున్నారు. ఇక అదే ఉమాకు బాగా కలిసొచ్చింది. మొత్తానికైతే ఏడాది కాలంలోనే ఉమా త‌న వ్యూహంతో మైలవరంలో మొత్తం సెట్ చేసుకోవ‌డంతో పాటు టీడీపీని అప్పుడే స్ట్రాంగ్ చేసుకున్నార‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news