Moviesఆ క్రేజీ క్రీడాకారిణి బ‌యోపిక్‌లో దీపికా ప‌దుకొనే..!

ఆ క్రేజీ క్రీడాకారిణి బ‌యోపిక్‌లో దీపికా ప‌దుకొనే..!

ప్ర‌స్తుతం భార‌త‌దేశ సినిమా రంగంలో అంతా బ‌యోపిక్‌ల హంగామానే న‌డుస్తోంది. ప‌లువురు ప్ర‌ముఖ క్రీడాకారుల జీవిత చ‌రిత్ర‌ల‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌లు వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో క్రేజీ క్రీడాకారిణి బ‌యోపిక్ వెండితెర‌పై సంద‌డి చేయ‌నుంది. ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవి. సింధు బ‌యోపిక్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

సింధు బ‌యోపిక్‌ను తాను నిర్మిస్తున్న‌ట్టు ఇప్ప‌టికే సోనూసుద్ ప్ర‌క‌టించారు. అయితే ఈ బయోపిక్‌లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్‌ అప్పుడే వెల్లడించట్లేదు. తాను సింధు బ‌యోపిక్ నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఎంతోమంది హీరోయిన్లు ఫోన్లు చేసి ఈ పాత్ర‌ను తామే చేస్తామ‌ని రిక్వెస్ట్ చేసిన‌ట్టు కూడా సోనూ వెల్ల‌డించారు. అయితే సింధు ముఖానికి త‌గిన ఎత్తు, ప‌ర్స‌నాలిటీకి క‌రెక్టుగా సెట్ అయ్యేది ఒక్క దీపిక ప‌దుకొనే మాత్ర‌మే.

అందుకే ఈ పాత్ర‌లో న‌టించాల‌ని సోను ఆమెను సంప్ర‌దించ‌గా ఆమె ఓకే చెప్పార‌ట‌. అయితే ఆమె కాల్షీట్లు లేని కార‌ణంగా ఇంకా ఈ బ‌యోపిక్ ప‌ట్టాలు ఎక్క‌లేద‌ని అంటున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత..  సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిల్లో నిజం లేద‌న్న సోనూ అన్ని క‌లిసొస్తే సింధుగా దీపిక‌నే న‌టిస్తుంద‌ని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news