Moviesస్వీటీ రుద్ర‌మ‌దేవి దుమ్ము రేపే రికార్డు... యూట్యూబ్‌లో సంచ‌ల‌నం

స్వీటీ రుద్ర‌మ‌దేవి దుమ్ము రేపే రికార్డు… యూట్యూబ్‌లో సంచ‌ల‌నం

జేజ‌మ్మ అనుష్క మెయిన్ లీడ్ రోల్లో వ‌చ్చిన రుద్ర‌మ‌దేవి సినిమా ఐదేళ్ల క్రితం రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. కాక‌తీయ వీర‌నారి రుద్ర‌మ‌దేవి జీవిత చ‌రిత్ర ఆధారంగా వ‌చ్చిన ఈ సినిమాలో అనుష్క‌, రానా, బ‌న్నీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. రుద్ర‌మ‌దేవి చ‌రిత్ర‌ను తెర‌కెక్కించేందుకు గుణ‌శేఖ‌ర్ ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చారు. ఇక ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్‌లో స‌రికొత్త సంచ‌ల‌నాల‌తో రికార్డు క్రియేట్ చేస్తోంది.

Rudhramadevi (film) - Wikipedia

గుణ టీం వ‌ర్క్స్ యూట్యూబ్ ఛానెల్లో ఉన్న రుద్ర‌మ‌దేవి హిందీ వెర్ష‌న్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 150 మిలియన్ వ్యూస్ వ‌చ్చాయి. అరుంధ‌తి త‌ర్వాత అనుష్క‌కు రుద్ర‌మ‌దేవి సినిమాతోనే మంచి పేరు వ‌చ్చింది. ఇక గోన గ‌న్నారెడ్డిగా బ‌న్నీ అద‌ర‌గొడితే, చాళుక్య వీర‌భ‌ద్రుడిగా రానా ద‌గ్గుబాటి రుద్ర‌మ భ‌ర్త పాత్ర‌లో న‌టించాడు. ఇక ఈ సినిమాలో అనుష్క టైటిల్ రోల్ చేసినా ఆమె, రానా క‌న్నా బ‌న్నీ చేసిన గోన గ‌న్నారెడ్డి పాత్ర‌కే మంచి పేరు వ‌చ్చింది.

Rudramadevi' review: Lengthy but interesting period drama - The Economic  Times

ఇక సౌత్ సినిమాలు హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ యూట్యూబ్లో ఇప్ప‌టికే సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో రుద్ర‌మ‌దేవి కూడా చేరింది. ఇక ప్ర‌స్తుతం అనుష్క న‌టిస్తోన్న నిశ్శ‌బ్దం సినిమా ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news