Gossipsబిగ్ అప్‌డేట్‌: ఆచార్య రిలీజ్ డేట్ లాక్‌...!

బిగ్ అప్‌డేట్‌: ఆచార్య రిలీజ్ డేట్ లాక్‌…!

మెగాస్టార్ చిరంజీవి – కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు. కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను ఇటీవ‌లే చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేశారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్లో చివ‌ర ఆచార్య‌ను వ‌చ్చే స‌మ్మ‌ర్ అంటే 2021 స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే ఈ సినిమా మీద రెండు సంవ‌త్స‌రాల పాటు కొర‌టాల వ‌ర్క్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌క కొర‌టాల సినిమా రాలేదు. ఇప్ప‌టికే ఆచార్య స్టార్ట్ చేసి కూడా చాలా లేట్ అవ్వ‌డంతో ఈ సారి ఎలాగైనా బంప‌ర్ హిట్‌తో స‌త్తా చాటాల‌ని కొర‌టాల – చిరు ఇద్ద‌రు స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే 2021 ఏప్రిల్ 9వ తేదీని లాక్ చేసి పెట్టి ఎట్టిపరిస్థితుల్లో ఆచార్య రిలీజ్ చేయాలని నిర్మాత‌లు డిసైడ్ అయిన‌ట్టు ఇండ‌స్ట్రీ లేటెస్ట్ టాక్‌..!

టాలీవుడ్‌లో చాలా మందికి ఏప్రిల్ 9 సెంటిమెంట్ డేట్‌. ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ కొట్టాయి. అందుకే ఇప్పుడు ఈ డేట్‌కే సినిమాను రిలీజ్ చేసేలా షూటింగ్ పినిష్ చేసేందుకు కొర‌టాల ప్లాన్ చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. కొర‌టాల ప్లానింగ్ ఎలా ఉన్నా క‌రోనా వీరికి ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news