సాహో పాటలు తెలుగులో ఎక్కలేదా..!

తెలుగు చిత్రసీమ గర్వపడే బాహుబలి తర్వాత సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సాహో సినిమానే. ప్రభాస్ హీరోగా , యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల అవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ అదరగొడుతుంది. సాహోలో ప్రభాస్ యాక్షన్ అదరహొ అనేలా ఉందని, ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ ని తలపిస్తుందని అభిమానులు చెప్పుకుంటున్నారు.
అయితే అన్నీ రకాలుగా క్రేజ్ ఉన్న సాహోలో ఒక విషయంలో నెగటివ్ వినిపిస్తోంది. అది ఈ చిత్ర పాటలకి సంబంధించి. సాహో హిందీ, తమిళ్, తెలుగులో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ లో ఆకట్టుకుంటున్న పాటలు మాత్రం టాలీవుడ్ లో ఆకట్టుకోవడం లేదు. ఎందుకంటే పాటలు ఎక్కువ బాలీవుడ్ ఫ్లేవర్ కి అనుకూలంగా ఉండటమే. పైగా సంగీత దర్శకులు అటు వాళ్లే. మొదట ఈ సినిమాకి శంకర్-ఎహ్సాన్-లోయ్ సంగీతాన్ని అందించాల్సి ఉంది. కానీ వాళ్లు తప్పుకున్న తర్వాత సినిమా కోసం కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ను తీసుకున్నారు. జీబ్రాన్, తనిష్క్ లు సాహోకి పని చేశారు.
ఇక ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పాటలు బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే అలరించాయి, కానీ తెలుగు ప్రేక్షకులకి ఏ మాత్రం చేరువ కాలేదు. బాలీవుడ్ ఫ్లేవర్ ఎక్కువగా అయిపోవడం వల్ల తెలుగులో పాటలు పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయాయని అంటున్నారు. టి సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ కూడా ‘సాహో’ సినిమా లోని పాటలు హిందీ భాషలో కేవలం బాలీవుడ్ ఆడియన్స్ కోసం కావాలని చేయించామని అలాగే తెలుగులో కూడా లిరిక్స్ బాగా రాయించాము అని చెబుతున్నారు. తెలుగులో కూడా పాటలు బాగా వచ్చాయని అంటున్నారు. కానీ ఆయన మాటల్లో చెప్పిన విధంగా పాటలు లేవని తెలుగు వాళ్ళు ఫీల్ అవుతున్నారు.

Leave a comment