Gossipsనాని ఇంద్రగంటి ఇంట్రెస్టింగ్ టైటిల్..!

నాని ఇంద్రగంటి ఇంట్రెస్టింగ్ టైటిల్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందన్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఇప్పటికే రెండు సినిమాలు ఈ కాంబినేషన్ లో వచ్చి హిట్ కొట్టగా హ్యాట్రిక్ కాంబోగా ఈసారి క్రేజీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. సినిమాలో సుధీర్ బాబు కూడా ఓ హీరోగా నటిస్తాడట. అదిరి రావు హైదరితో పాటుగా మేఘా ఆకాష్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకున్నారట.

ఇక ఈ సినిమాలో నాని క్యారక్టర్ కొత్తగా ఉంటుందట. ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ తో నాని సాహసమే చేస్తున్నాడని చెప్పాలి. ఇక మూవీ టైటిల్ గా వి అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. వి అంటే విక్టరీనా.. లేక విలన్ అనా అన్నది తెలియాల్సి ఉంది. సినిమాలో నాని రోల్ ఎవరు ఊహించని విధంగా క్రేజీగా ఉంటుందట. ప్రస్తుతం జెర్సీ సక్సెస్ జోష్ ఎంజాయ్ చేస్తున్న నాని త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు.

అయితే ఆల్రెడీ నాని విక్రం కుమార్ కాంబినేషన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా వస్తుంది. ఈ సినిమాతో కూడా పక్కా హిట్ కొడతానన్న కాన్ఫిడెంట్ నానిలో కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు పోయినా ఈ ఇయర్ జెర్సీతో నాని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. గ్యాంగ్ లీడర్ కూడా దసరా టైం కు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news