Gossipsమోక్షజ్ఞ విషయంపై నందమూరి ఫ్యాన్స్ లో టెన్షన్..!

మోక్షజ్ఞ విషయంపై నందమూరి ఫ్యాన్స్ లో టెన్షన్..!

నందమూరి ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో వారసుడు మోక్షజ్ఞ. బాలకృష్ణ నట వారసత్వాన్ని కొనసాగించేలా తాత వేసిన ఈ బంగారు బాటలో నడిచేలా మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది. అయితే రెండు మూడు ఏళ్ల నుండి మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు వస్తున్నాయి. లెజెండ్, శాతకర్ణి సినిమాల్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉందని ఆశపెట్టారు కాని అలా జరగలేదు. ఇక బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో కూడా మోక్షజ్ఞ నటిస్తున్నాడని అన్నారు.. కాని ఈ సినిమాలో కూడా లేడని తెలుస్తుంది.

మోక్షజ్ఞ ఫారిన్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యత కూడా పొందుతున్నాడట. లెజెండ్ సినిమా టైంలో షూటింగ్ స్పాట్ లో కనిపించిన మోక్షజ్ఞ అందరిని అలరించాడు. అప్పుడు మోక్షజ్ఞని చూసి నందమూరి ఫ్యాన్స్ అంతా ఖుషి అయ్యారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఈమధ్య మోక్షజ్ఞ ఓ పిక్ బయటకు వచ్చింది. అయితే అందులో కాస్త లావుగా కనిపించాడు. కాబోయే హీరో నందమూరి వారసుడు ఇలా ఉంటే కష్టమే అనుకున్నారు కొందరు ఫ్యాన్స్.

అయితే నందమూరి ఫ్యాన్స్ అందరికి షాక్ ఇచ్చేలా మోక్షజ్ఞ ప్రస్తుత లుక్ ఉందట. డైట్ పాటించి లావు తగ్గించుకున్నాడట మోక్షజ్ఞ. రీసెంట్ గా కె.జి.ఎఫ్ సినిమా కోసం ప్రసాద్ ల్యాబ్ కు వచ్చాడట మోక్షజ్ఞ. ఆ సినిమా ప్రీమియర్ షోని ప్రసాద్ ల్యాబ్ లో చూశాడట. ఆ టైం లో మోక్షజ్ఞని చూసిన వారు షాక్ అయ్యారట. తనలో ఈ మార్పు కచ్చితంగా ఫ్యాన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. మరి ఆన్ స్క్రీన్ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో చూడాలి. 2019లో అయినా మోక్షజ్ఞ సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు నందమూరి అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news