Gossipsచిరంజీవి పరువు తీస్తున్న స్టార్ కమెడియన్..!

చిరంజీవి పరువు తీస్తున్న స్టార్ కమెడియన్..!

చిరంజీవి అభిమాని అంటూ చివరకు అతని పరువుని తీస్తున్నాడు.. మెగాస్టార్ ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యేలా చేస్తున్నాడు కమెడియ షకలక శంకర్. శంభో శంకర సినిమాతో హీరోగా కొత్త టర్న్ తీసుకున్న షకలక శంకర్ ప్రస్తుతం మరో సినిమా చేస్తున్నాడు. హనుమాన్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా ఖైది అని పెట్టబోతున్నారట. మెగాస్టార్ కెరియర్ లో ఖైది సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు.
2
అంతేకాదు ఖైది సినిమా టైటిల్ రైట్స్ అన్ని మెగా కాంపౌండ్ కు చెందినవి. అలాంటిది షకలక శంకర్ ఖైది టైటిల్ వాడటం అందర్ని షాక్ అయ్యేలా చేస్తుంది. మెగా ఫ్యామిలీ అభిమానిగా వారి టైటిల్స్ వాడుతూ పరువు తీస్తున్నాడని మెగా ఫ్యాన్స్ వాపోతున్నారు. మెగా మేనళ్లుడు గ్యాంగ్ లీడర్, విజేత టైటిల్ వాడుతా అంటేనే ఓ రేంజ్ లో ఫైర్ అయిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు షకలక శంకర్ మాత్రం ఖైది టైటిల్ పెడుతుంటే ఏమంత ట్రోల్ చేయట్లేదు.
1
టైటిలే కదా అని వదులుతున్నారో లేక మన్వాడే కదా అని అనుకున్నారో కాని సాయి ధరం తేజ్ విషయంలో రివర్స్ అయినట్టుగా షకలక శంకర్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ వెనక్కి తగ్గుతున్నారు. మరి దీనికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news