చరణ్ నిర్మాతగా ఎన్టీఆర్ మూవీ..?

Ram charan to produce a movie with ntr

మెగా నందమూరి కాంబినేషన్ లో రాజమౌళి మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. బహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేసే ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్స్ సన్నద్ధం అవుతున్నారు. ఇక ఇదే కాకుండా చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి మరో ప్రాజెక్ట్ చేస్తున్నారట.

కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి రాం చరణ్ నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సినిమా ఆ బ్యానర్ లోనే వచ్చింది. ఇక మరోపక్క సైరా సినిమాను కూడా చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ ఎన్.టి.ఆర్ సినిమా నిర్మిస్తాడని తెలుస్తుంది.

చరణ్, ఎన్.టి.ఆర్ ల మధ్య స్నేహం అందరికి తెలుసు. అందుకే కొణిదెల ప్రొడక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా ఓ క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. మల్టీస్టారర్ పూర్తి కాగానే ఎన్.టి.ఆర్ చేసే మూవీ ఇదే అని అంటున్నారు. నిర్మాతగా చరాణ్, హీరోగా ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి మెగా నందమూరి ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.

Leave a comment