నోటా విడుదల కష్టమేనా?

Nota release in troubles

విజయ్ దేవరకొండ హీరోగా కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో రెమ్యునరేషన్ గొడవలు అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నాయి. తమిళ సినిమానే అయినా తెలుగులో నోటా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగులో శశాంక్ వెన్నెలకంటి మాటలను రాశారు.

అయితే దీనికి సంబందించిన రెమ్యునరేషన్ క్లియర్ చేయలేదట. అంతేకాదు తెలుగు నోటా టైటిల్స్ లో తన పేరు వేయలేదట. అందుకే శశాంక్ వెన్నెలకంటి తన విషయంలో నోటా దర్శక నిర్మాతలు అన్యాయం చేశారని ఫైర్ అవుతున్నాడు. తనకు రావాల్సిన మొత్తం ఇస్తేనే కాని ఆ సినిమా రిలీజ్ అవదని.. లేదంటే రిలీజ్ ఆపేస్తానని అంటున్నాడు శశాంక్ వెన్నెలకంటి.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న నోటా సినిమాలో విజయ్ దేవరకొండ సిఎం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. గీతా గోవిందం తర్వాత వస్తున్న నోటా సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది.

Leave a comment