Newsవిశాల్ నిజమైన "హీరో" .. విశాల్ ను చూసి మన హీరోలు...

విశాల్ నిజమైన “హీరో” .. విశాల్ ను చూసి మన హీరోలు మారాల్సిందే..!

తెలుగువాడే అయినా తమిళనాట స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విశాల్ తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఈమధ్య వరుస కంటెంట్ ఫుల్ మూవీస్ చేస్తూ హిట్లు కొడుతున్న విశాల్ లేటెస్ట్ గా అభిమన్యుడుగా వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్నాడు. తెలుగులో మంచి వసూళ్లను రాబడుతున్న అభిమన్యుడు సినిమా నిర్మాతగా విశాల్ తన లాభాల్లో వాటాని రైతులకు ఇస్తున్నాడు.

టికెట్ ప్రైజ్ లో ఒక రూపాయిని తెలుగు రాష్ట్రాల రైతులకు ఇస్తున్నట్టు ప్రకటించాడు విశాల్. అభిమన్యుడు సినిమా రెండు వారాల్లో 12 కోట్ల షేర్ వసూళు చేసింది. ఈ లెక్కన పెద్ద మొత్తమే తెలుగు రైతులకు ఇవ్వనున్నాడు విశాల్. తెలుగువాడే అయినా తమిళ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విశాల్ అన్నదాతల పట్ల చూపించిన అభిమానానికి హ్యాట్సాఫ్ అంటున్నారు. కచ్చితంగా తెలుగు హీరోలు అతన్ని చూసి ఎంతోకొంత నేర్చుకోవాలని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news