Gossipsఆరోజే సైరా ఫస్ట్ లుక్.. పక్కా ప్లానింగ్ తో చిరంజీవి..!

ఆరోజే సైరా ఫస్ట్ లుక్.. పక్కా ప్లానింగ్ తో చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా చేస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసిందే. పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఓ కమర్షియల్ సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఈసారి ఓ ప్రయోగమే చేస్తున్నాడు.

సైరా నరసింహారెడ్డి విషయంలో ప్రతిది చాలా ఎక్స్ క్లూజివ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమా ఎనౌన్స్ మెంట్ రోజే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సైరా యూనిట్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆగష్టు 22 చిరు బర్త్ డే రోజున రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా గిఫ్ట్ వారికి ఇచ్చేలా ప్లాన్ చేశారు.

దానికి సంబందించిన కార్యక్రమాలు ఇప్పటి నుండే మొదలుపెట్టారట. ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేయాలని బాగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాలో చిరు లుక్ లీక్ అవగా అఫిషియల్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి సైరా ఫస్ట్ లుక్ ఎలాంటి సంచలనంగా మారుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news