కొహ్లి కన్నా ముందే “ఆ” రికార్డు కొట్టిన మిథాలి రాజ్..!

భారత యువ సంచలనం విరాట్ కొహ్లి విధ్వంసానికి జట్టు రికార్డులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే అలాంటి విరాట్ కొహ్లిని దాటి భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి మిథాలి రాజ్ అరుదైన రికార్డ్ సాధించింది. టి20ల్లో పరుగుల మిషన్ విరాట్ కొహ్లి కన్నా మిథాలి రాజ్ ఎక్కువ పరుగులు సాధించి క్రేజీ రికార్డ్ తన సొంతం చేసుకుంది మిథాలి రాజ్.

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక మీద 23 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించింది. ఇక ఈ పరుగులతో ఆమె టి20ల్లో 2015 ప్రుగులు చేసిది. టి20ల్లో 2000 పరుగులు సాధించిన భారత క్రీడాకారిణిగా మిథాలి రాజ్ మొదట ఆ రికార్డ్ అందుకుంది.

విరాట్ కొహ్లి ప్రస్తుతం 1983 పరుగుల మీద ఉన్నాడు. విరాట్ కొహ్లి కన్నా మిథాలి ఈ మైల్ స్టోన్ అందుకోవడం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఆమెకు క్రీడా అభిమానులంతా ప్రంశంసలు అందిస్తున్నారు.

Leave a comment