Gossipsషాకింగ్ : త్రివిక్రమ్ ను పక్కన పెట్టేసిన అరవింద సమేత...

షాకింగ్ : త్రివిక్రమ్ ను పక్కన పెట్టేసిన అరవింద సమేత !

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ సినిమా అంటే కథ, కథనాలు ఎలా ఉన్నా సినిమా డైలాగుల కోసం అయినా ఓసారి చూసేయొచ్చు అన్న విధంగా ఉంటుంది. తను చేసిన ప్రతి సినిమాలో ఆడియెన్స్ మదిలో నిలిచిపోయే మాటలను రాస్తాడు త్రివిక్రం. అయితే వరుస హిట్లు కొట్టినా ఒక్క అజ్ఞాతవాసి ఫ్లాప్ తో త్రివిక్రం క్రేజ్ తగ్గిపోయింది. ఎంతలా అంటే తన సినిమా విషయంలో తాను నిర్ణయం తీసుకోలేనంత అని తెలుస్తుంది.

అసలు విషయానికొస్తే త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా ఓవర్సీస్ రైట్స్ ఎల్.ఏ తెలుగు సంస్థ కొన్నది. అయితే వారికి ఈ సినిమా రైట్స్ ఇవ్వడం త్రివిక్రం కు ఏమాత్రం ఇష్టం లేదట. అజ్ఞాతవాసి సినిమా ఇస్తేనే అక్కడ సరిగా ప్రమోట్ చేయలేదని.. ఈసారి వేరే వాళ్లకు ఇవ్వాలని అనుకున్నాడు త్రివిక్రం.

కాని నిర్మాతల ఒత్తిడి వల్ల తప్పలేదని తెలుస్తుంది. అంతేకాదు ఓవర్సీస్ లో ఎన్.టి.ఆర్ కు ఇంకా మార్కెట్ పెంచాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అక్కడ అరవింద సమేత 15 కోట్లు మాత్రమే అడిగారట. అజ్ఞాతవాసి ఎఫెక్ట్ బాగా కొట్టడంతో త్రివిక్రం వద్దానా సరే వారికే సినిమా ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news