Movies" సమ్మోహనం " ట్రైలర్.. సుధీర్ బాబు ఈసారి కొట్టేలానే ఉన్నాడు..!

” సమ్మోహనం ” ట్రైలర్.. సుధీర్ బాబు ఈసారి కొట్టేలానే ఉన్నాడు..!

సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సమ్మోహనం. మొన్నామధ్య రిలీజ్ అయిన టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన సమ్మోహనం కొద్దినిమిషాల క్రితం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమాల మీద ముఖ్యంగా హీరోయిన్స్ మీద మంచి అభిప్రాయం లేని అబ్బాయి ఓ హీరోయిన్ తో ప్రేమలో పడటం ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ.

సినిమాలో సుధీర్ బాబు ఇదవరకు సినిమాల్లో కన్నా చాలా గ్లామర్ గా కనిపిస్తున్నాడు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమెకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికిందని తెలుస్తుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నానితో జెంటిల్ మన్ సినిమా తీసి హిట్ అందుకున్న ఈ సీనియర్ నిర్మాత ఇప్పుడు సుధీర్ బాబు సినిమాతో వస్తున్నాడు.

ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. త్వరలో రిలీజ్ డేట్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా సుధీర్ బాబు కెరియర్ లో మంచి సినిమాగా మిగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news