Gossipsమరో సారి పెళ్లిపీటలు ఎక్కబోతున్న చరణ్..?

మరో సారి పెళ్లిపీటలు ఎక్కబోతున్న చరణ్..?

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బుల్లితెర భామ ఈమధ్య సినిమాల్లో సపోర్టింగ్ క్యారక్టర్ లో నటిస్తున్న ప్రియ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్రూషియల్ రోల్ లో నటిస్తుందట.

ఎలా అంటే ఆమె పెళ్లి బట్టల్లో పక్కన రాం చరణ్ తో ఉండటం అందరికి షాక్ ఇచ్చింది. ఈ పిక్ ను అమ్మడు తన ఇన్ స్ట్రాగ్రాం లో పెట్టింది. ఫ్లాష్ బ్లాక్ లుక్ హూ జ్ పైరింగ్ అంటూ ప్రియా రాం చరణ్ తో పాటు పెళ్లి బట్టలతో ఉన్న పిక్ ను షేర్ చేసింది. చూస్తుంటే ఈ సినిమాలో ఆమెకు మంచి రోల్ దొరికినట్టు తెలుస్తుంది. 

సీరియల్స్ నుండి సినిమాలకు ప్రమోట్ అయిన ప్రియా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో హాట్ ఇమేజ్ సంపాదించుకోవడం విశేషం. మరి ఈ పెళ్లి దుస్తుల అసలు మ్యాటర్ ఏంటో సినిమా వస్తేనే కాని తెలుస్తుంది.
 ram charn priya

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news