Gossipsబికిని వేసింది.. భలే ఛాన్సులు పట్టేస్తుంది..!

బికిని వేసింది.. భలే ఛాన్సులు పట్టేస్తుంది..!

ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తన క్యూట్ లుక్స్ తో అలరించిన పూజా హెగ్దె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం సినిమా చేసింది ఆ సినిమాలో అమ్మడి బికిని లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు తీసుకురావడంతో అమ్మడి రేంజ్ పెరిగింది. డిజె తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజా ఇప్పుడు ఎన్.టి.ఆర్ సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా పూజాని సెలెక్ట్ చేశారట. ఇక ఇదే కాకుండా మహేష్ వంశీ పైడిపల్లి సినిమాలో కూడా ఇంకా పూజాతో చర్చలు జరుగుతున్నాయట. ఈ రెండు లక్కీ ఛాన్సులు పూజా అందుకుంటే కనుక ఇక తెలుగులో అమ్మడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు. అయితే ఈ రెండు సినిమాల్లో పూజా కు బదులు రకుల్ పేరు వినిపిస్తుంది. మరి అసలు హీరోయిన్ ఎవరు అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news