Moviesస్నేహితుడే విలన్.. సాయి ధరం తేజ్ జవాన్ కథ మొత్తం లీక్..!

స్నేహితుడే విలన్.. సాయి ధరం తేజ్ జవాన్ కథ మొత్తం లీక్..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా రచయిత బివిఎస్ రవి దర్శకుడిగా చేస్తున్న

రెండో ప్రయత్నంగా జవాన్ సినిమా వస్తుంది. కృష్ణ నిర్మాణంలో వస్తున్న సినిమాలో మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఇక సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో స్టోరీ చెక్కర్లు కొడుతుంది.

  సినిమాలో సాయి ధరం తేజ్ తో పాటు ఇందులో యువ హీరో స్పెషల్ క్యారక్టర్ కూడా ఉంటుందట. సినిమా మొత్తం హీరోతో పాటుగా పాత్ర కూడా ఇంపార్టెంట్ అని అంటున్నారు. స్నేహితుడి కోసం ఏదైనా చేసే పాత్రలో హీరో కనిపిస్తాడని. అయితే స్నేహితుడే ఇంటర్వల్ టైంకు నెగటివ్ గా మారుతాడని అంటున్నారు.

 సినిమాలో అతనే విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా అసలైతే సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా సినిమా అక్టోబర్ కు పోస్త్ పోన్ అయ్యిందట. మరి సినిమా తేజ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news