Moviesపవర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్..ఫ్యాన్స్ కు పండుగే..!

పవర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్..ఫ్యాన్స్ కు పండుగే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా నిన్న సాయంత్రమే కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయగా ఇక ఈరోజు తెల్లవారక ముందే 3 గంటలకే అనిరుధ్ కంపోజ్ చేస్తున్న సినిమాలోని సాంగ్ బిట్ రిలీజ్ చేశారు. ‘బయటకొచ్చి చూస్తే 3 క్లాక్అంటూ అనిరుధ్ కంపోజ్ చేసి ఆలపించిన సాంగ్ త్రివిక్రం మార్క్ సాంగ్ లా అనిపిస్తుంది.

పవర్ స్టార్ లాంటి క్రేజీ హీరోకి మ్యూజిక్ అందించే అవకాశం వచ్చినందుకు అనిరుధ్ రవిచంద్రన్ బాగానే వర్క్ అవుట్ చేసినట్టే కనిపిస్తున్నాడు. ఇక సాంగ్ కంపోజిషన్ లో త్రివిక్రం ఎంత ఇన్వాల్వ్ అయ్యాడో వీడియో చూస్తే అర్ధమవుతుంది. సినిమాలో సాంగ్ ఎలా ఉంటుందో ఏమో కాని రిలీజ్ అయిన బిట్ సాంగ్ లో డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్ ఇద్దరు సాంగ్ మూడ్ లో అద్భుతంగా కనిపించారు.

ఇక చివరన కుర్చిని తిప్పుతూ షాడో ఇమేజ్ లో పవన్ కళ్యాణ్ కనిపించి బర్త్ డే గిఫ్ట్ బిట్ సాంగ్ లో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. మొత్తానికి సినిమా టైటిల్ అయితే తెలియలేదు కాని రిలీజ్ డేట్ మాత్రం 2018 జనవరి 10 అని ఎనౌన్స్ చేశారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news