Gossipsమహేష్, పవన్ తర్వాత విజయ్ దేవరకొండ.. ఇక తిరుగేలేదు..!

మహేష్, పవన్ తర్వాత విజయ్ దేవరకొండ.. ఇక తిరుగేలేదు..!

కొత్తగా వచ్చిన కుర్రాడు బాక్సాఫీస్ ను కుదిపేస్తుంటే తెల్లమొహాలు వేసుకొని చూస్తున్నారు స్టార్ హీరోలు. ఓ చిన్న సినిమాతో పరిచయమై.. ఆ తర్వాత అలాంటి చిన్న సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న ఆ హీరో ఇప్పుడు థియేటర్ లో ఓ అదిరిపోయే బొమ్మతో వసూళ్లు అదరగొడుతున్నాడు. ఇంతకీ ఎవరా హీరో అంటే అర్జున్ రెడ్డిగా అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న హీరో విజయ్ దేవరకొండ.

అర్జున్ రెడ్డితో నటన పరంగా మనవాడు చూపించిన అభినయం ప్రేక్షకులనే కాదు సిని ప్రముఖులను సైతం ఫిదా అయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు మహేష్, పవన్ తర్వాత విజయ్ ఓ క్రేజీ ఛాన్స్ అందుకున్నాడు. అదేంటి అంటే విక్టరీ వెంకటేష్ తో నటించే అవకాశం అని తెలుస్తుంది.

టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ స్టార్ట్ చేసిన వెంకటేష్ ఇప్పుడు మరో మల్టీస్టారర్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తాడని అంటున్నారు. మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ తో గోపాల గోపాల తర్వాత రామ్ తో మసాలా మూవీ చేసిన వెంకటేష్ ఆ తర్వాత విజయ్ లాంటి యువ హీరోతో మల్టీస్టారర్ కు సై అన్నాడట. మరి ఈ సినిమా కన్ఫాం అయితే వెంకటేష్ తో చేయబోయే విజయ్ సినిమాకు భలే క్రేజ్ వచ్చేసినట్టే. తనని తాను స్టార్ గా మలచుకునేలా విజయ్ చేస్తున్న సినిమాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news