ఎవరేం చెప్పినా డీజే ఫైనల్ కలెక్షన్లు ఇవే.. బన్ని మరోసారి బీభత్సం సృష్టించాడు..!

duvvada jagannadham final collections

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరిష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా దువ్వాడ జగన్నాధం. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. సినిమా రిలీజ్ నాడు మిక్సెడ్ రెస్పాన్స్ వచ్చినా చిత్రయూనిట్ చేసిన హడావిడికి సినిమా పోయిందనే అనుకున్నారు. రిలీజ్ తర్వాత వారానికే 100 కోట్లు అంటూ మెగా ఫ్యాన్స్ కోపానికి బలిన బన్ని సినిమా ఫుల్ రన్ లో 72 కోట్లు లాగేశాడట.

80 కోట్ల దాకా థియేట్రికల్ రైట్స్ కొనేయగా ఈ సినిమా ఓవరాల్ గా 72 కోట్లు వసూలు చేసింది. సినిమా మాములు టాక్ వచ్చినా సరే కలక్షన్స్ ఈరేంజ్ లో ఉన్నాయంటే కచ్చితంగా బన్ని స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయినట్టే. ఇక ఏరియాల వారిగా ఈ సినిమా కలక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే.. నైజాం 20.4 కోట్లు, సీడెడ్ 10.4 కోట్లు వైజాగ్ 7.41 కోట్లు, ఈస్ట్ 4.79 కోట్లు, వెస్ట్ 4.02 కోట్లు, కృష్ణా 4.03 కోట్లు, గుంటూర్ 5.45 కోట్లు, నెల్లూరు 2.40 కోట్లు సాధించి తెలుగు రెండు రాష్ట్రాల్లో 58.9 కోట్లు వసూలు చేసింది. కర్ణాటక 6.77 కోట్లు, కెరళ 0.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి రాబట్టగా.. ఓవర్సీస్ 4.48 కోట్లను వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా డిజె 72 కోట్ల కలక్షన్స్ సాధించింది.

టాక్ ఎలా ఉన్నా సరే బాక్సాఫీస్ పై బన్ని ప్రతాపం మాత్రం బాగానే చూపించాడని చెప్పొచ్చు. మరి మాములు టాక్ తోనే ఈ రేంజ్ కలక్షన్స్ అంటే ఒకవేళ సినిమా హిట్ టాక్ వస్తే ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.

Leave a comment