Moviesరాజు గారి గది-2 లోగో లాంచ్.. బాబోయ్ థమన్ ఏంటీ విజృంభణ..!

రాజు గారి గది-2 లోగో లాంచ్.. బాబోయ్ థమన్ ఏంటీ విజృంభణ..!

ఓంకార్ డైరక్షన్ లో లాస్ట్ ఇయర్ సూపర్ సక్సెస్ అయిన రాజు గారి గది సినిమాకు సీక్వల్ గా వస్తున్న సినిమా రాజు గారి గది-2. కింగ్ నాగార్జున ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తుండగా సమంత కూడా ఇందులో స్పెషల్ రోల్ లో కనిపిస్తుంది. అశ్విన్, సీరత్ కుమార్ కూడా మెయిల్ లీడ్ లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా టైటిల్ లోగో లాంచ్ చేశారు.

చెప్పాలంటే టైటిల్ లోగో ఎంతో అద్భుతంగా ఉంది. ఇక మోషన్ పోస్టర్ లో థమన్ మ్యూజిక్ అయితే సౌండ్ లేదని చెప్పాలి. ఈమధ్య కసి పెంచుకున్న థమన్ వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా మోషన్ పోస్టర్ కు కూడా థమన్ మ్యూజిక్ అందించాడని టాక్.

మొత్తానికి కాపీ మ్యూజిక్ అన్న బ్యాడ్ నేం నుండి క్రియేటివ్ మ్యూజిక్ డైరక్టర్ గా పేరు తెచ్చుకునేందుకు థమన్ బాగానే కష్టపడుతున్నాడని చెప్పొచ్చు. ఇక రాజు గారి గది-2 టైటిల్ లోగో కూడా చాలా కొత్తగా ఉంది. సినిమాతో ఓంకార్ మళ్లీ హిట్ అందుకుంటాడని అనిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ నెల 29 నాగార్జున బర్త్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news