Moviesఅతను మెగాస్టార్ అవుతాడు.. వర్మ చెప్పిన విజయ్ జాతకం..!

అతను మెగాస్టార్ అవుతాడు.. వర్మ చెప్పిన విజయ్ జాతకం..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా సరే అదో సంచలనమే అన్న విషయం తెలిసిందే. ట్విట్టర్ కు గుడ్ బై చెప్పినా అర్జున్ రెడ్డి కోసం ఇన్ స్టాగ్రాం లో కూడా కామెంట్లు విసురుతున్న ఆర్జివి రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా చూసి ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేశాడు. తాను చూసిన నటులలో అమితాబ్ బచ్చన్ తర్వాత అంత ఇంటెన్సిటీ ఉన్న నటుడు విజయ్ అని అన్నారు.

అంతేకాదు యంగ్ అమితాబ్, యంగ్ ఆల్ ప్యాచినో కలిపితే విజయ్ అవుతాడని ప్రశంసలు కురిపించారు. ఈ కాలం హీరోలకు హీరోగా కనిపించడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్లో మోషన్ షాట్స్ అవసరం కాని విజయ్ కు అలాంటివి అవసరమే లేదని అన్నారు వర్మ. అర్జున్ రెడ్డి సినిమా చూసిన వర్మ విజయ్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. అతను టాలీవుడ్ అమితాబ్ అని.. తెలంగాణా రాష్ట్రం నుండి వచ్చిన మొదటి మెగాస్టార్ అని అన్నారు. మొత్తానికి వర్మ ఈ రేంజ్ లో పొగిడేలా చేశాడంటే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ నటన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తన పాత్రకు పర్ఫెక్ట్ అభినయంతో అలరించిన విజయ్ ఈ సినిమాకు తన నటన పరంగా మంచి మార్కులే సంపాదించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news