Gossipsఎన్టీఆర్ బిగ్ బాస్ కు బాలయ్య వస్తే.. నందమూరి ఫ్యాన్స్ కు...

ఎన్టీఆర్ బిగ్ బాస్ కు బాలయ్య వస్తే.. నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చే న్యూస్..!

యంగ్ టైగర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ వన్ అనుకున్నట్టుగానే అదరగొడుతుంది. స్టార్ మాను టాప్ రేంజ్ లో ఉంచిన ఈ రియాలిటీ షోలో తారక్ అభినయం బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ షోను ప్రేక్షకులు చూసేందుకు సెలబ్రిటీస్ ను కూడా ఈ షోలో పాటిస్పేట్ అయ్యేలా చేస్తున్నారు.

ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి గురించి రానా, ఆనందో బ్రహ్మ ప్రమోషన్ కోసం తాప్సీ, రీసెంట్ గా అర్జున్ రెడ్డి గురించి విజయ్ దేవరకొండ బిగ్ బాస్ షోలో సర్ ప్రైజ్ విజిట్ చేశారు. హౌజ్ మెట్స్ తో సెలబ్రిటీస్ చేసే హంగామా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ బిగ్ బాస్ లోకి బాలయ్య కూడా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

పూరి డైరక్షన్ లో బాలయ్య 101వ సినిమాగా రాబోతున్న పైసా వసూల్ సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అబ్బాయ్ షోకి బాబాయ్ రాబోతున్నాడని లేటెస్ట్ టాక్. ఈ ఎంట్రీతో అటు బాలాయ్య సినిమాకు ప్రమోషన్ తో పాటుగా బాలయ్య ఎన్.టి.ఆర్ ల మధ్య ఉన్న దూరం కూడా చెరిగిపోయేలా స్కెచ్ వేస్తున్నారట. మరి బాలయ్య దీనికి ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఒకవేళ నిజంగానే ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ కు బాలకృష్ణ వస్తే కచ్చితంగా ఆ ఎపిసోడ్ రికార్డ్ బద్ధలు కొట్టే టి.ఆర్.పి సాధించడం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news