Moviesబాలయ్య రియల్ స్టంట్.... హీ నీడ్స్ నో స్టంట్ డ్రైవర్...(వీడియో)

బాలయ్య రియల్ స్టంట్…. హీ నీడ్స్ నో స్టంట్ డ్రైవర్…(వీడియో)

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తన 101వ సినిమాగానటిస్తున్న సినిమా పైసా వసూల్ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ, ముస్కాన్ సేథిలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య కొన్ని రిస్కీ స్టంట్స్ ను డూప్ లేకుండా స్వయంగా చేశాడు.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న పైసా వసూల్ టీం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంటూనే…ఇటు మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగా మొదలు పెట్టిన యూనిట్ ఇప్పటికే స్టంపర్ రిలీజ్ తో సరికొత్తగా అలరించింది. తాజాగా బాలయ్య స్వయంగా డూప్ లేకుండా చేసిన కార్ స్టంట్ కు సంబంధించిన వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు. శ్రియతో పాటు కారులో వెళ్తున్న బాలయ్య స్వయంగా జీర్ కట్ చేసి యూనిట్ సభ్యులను ఆశ్చర్యపరిచాడు. అందుకే స్టంట్ ను చూపిస్తూ స్పెషల్ టీజర్ రిలీజ్ చేసిన యూనిట్ ‘హీ నీడ్స్ నో స్టంట్ డ్రైవర్’ (ఇతనికి స్టంట్ డ్రైవర్ అవసరం లేదు) అంటూ టీజర్ ను ముగించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news