Moviesఎన్నో ఎన్నో భావాలతో నాగ చైతన్య కొత్త పుంతలు..?

ఎన్నో ఎన్నో భావాలతో నాగ చైతన్య కొత్త పుంతలు..?

వారాహి చలనచిత్రం బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా ‘యుద్ధం శరణం’ నాగచైతన్య హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో ఆర్వీ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. పనిలో పనిగా ‘రక్షా బంధన్’ స్పెషల్ గా ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్ సభ్యులు.

రాఖీ విశిష్టతను వివరించేలా నాగచైతన్యకు తన సోదరీమణులు రాఖీ కుడుతుండగా.. ‘రాఖీ ఎందుకు కడతారో తెలుసా..? అక్కా, చెల్లి బాధ్యత అమ్మానాన్నల తర్వాత అన్నదమ్ములదే అని ప్రతి నిముషం గుర్తు చేయడానికి’ అని చైతన్యకు తల్లిగా నటించిన రేవతి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘ఎన్నో ఎన్నో భావాలే.. పెనవేసే ఎదలో రాగాలే’ అంటూ సాగే ఈ పాటను ప్రదీప్ కుమార్ పాడగా వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేశారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, రావురమేష్, ప్రియదర్శి, మురళీశర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news