Moviesచిరు ఉయ్యాలలో మహావీర....టైటిల్ అదిరింది ...గురూ...

చిరు ఉయ్యాలలో మహావీర….టైటిల్ అదిరింది …గురూ…

ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా ఓ చారిత్రక కథతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. వంద కోట్ల వసూళ్లు సాధించిన తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆంగ్లేయుల మీద తిరగబడ్డ తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో జనం ముందుకు వచ్చేందుకు సినిమా ప్లాన్ చేస్తున్నాడు. చిరుకు జోడిగా బాలీవుడ్ బ్యూటి ఐశ్వర్యారాయ్ నటిస్తున్నట్టు, తనతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి.

ఈ సినిమా గురించి తాజాగా మరో వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈగ, బాహుబలి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సుధీప్ కీలక పాత్రలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సినీ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని భాషల్లో కలిసొచ్చేలా సినిమాకు మహావీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం. దాదాపు అన్ని భాషల్లో సినిమాను తెరకెక్కించే ఉదేశ్యంతో చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమాలో పరభాషా నటులను తీసుకునేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news