Moviesకలక్షన్స్ తో దుమ్ముదులుపుతున్న అర్జున్ రెడ్డి.. అసలైన హిట్ అంటే ఇదే..!

కలక్షన్స్ తో దుమ్ముదులుపుతున్న అర్జున్ రెడ్డి.. అసలైన హిట్ అంటే ఇదే..!

ఓ చిన్న సినిమా ప్రభంజనాలు సృష్టించగలిగితే దాని రేంజ్ ఏంటి అనేది అర్జున్ రెడ్డి సినిమా వసూలు చేస్తున్న కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన మొదటి షో నుండి భీభత్సమైన పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిపోతుంది. ఇక ఈ సినిమా వసూళ్లతో స్టార్స్ సైతం షాక్ అయ్యేలా ఉన్నారంటే నమ్మాల్సిందే.

సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో షాలిని హీరోయిన్ గా నటించింది. 5 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారంలోనే 11.9 కోట్ల కలక్షన్స్ తో దుమ్మురేపుతుంది. సినిమాకు ముందు నెగటివ్ ప్రమోషన్స్ వచ్చినా రిలీజ్ తర్వాత అర్జున్ రెడ్డి సంచలనాలకు అందరు సాక్షులుగా నిలుస్తున్నారు. సినిమా చూసి సెలబ్రిటీస్ సైతం తమ స్పందన తెలియచేస్తూ చిత్రయూనిట్ ను అభినందించడం విశేషం.

ఇక ఏరియాల వారిగా ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం 3.56 కోట్లు, సీడెడ్ 0.70 కోట్లు, వైజాగ్ 0.64 కోట్లు, గుంటూర్ 0.50 కోట్లు, ఈస్ట్ 0.54 కోట్లు, వెస్ట్ 0.25 కోట్లు, కృష్ణా 0.55 కోట్లు, నెల్లూరు 0.18 కోట్లు ఏపి, తెలంగాణా రాష్ట్రాలలోనే ఈ సినిమా మొదటి వారంలోనే 7.09 కోట్ల కలక్షన్స్ వసూలు చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 0.60 కోట్లు, యూఎస్ లో 3.40 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా తొలి వీకెండ్ లో అత్యంత భారీగా 11.09 కోట్లతో అర్జున్ రెడ్డి అంచనాలను మించి అదరగొడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news