Moviesబాహుబలి రికార్డుల భరతం పట్టిన అజిత్..!

బాహుబలి రికార్డుల భరతం పట్టిన అజిత్..!

కోలీవుడ్ సూపర్ హీరో తల అజిత్ రీసెంట్ గా వివేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో వివేకం అంటూ వచ్చిన ఈ సినిమా ఇక్కడ ఆడియెన్స్ కు రుచించలేదు. అయితే కోలీవుడ్ లో కూడా ఈ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ తో మాత్రం ప్రభంజనాలు సృష్టిస్తుంది. ముఖ్యంగా సినిమా చెన్నై పట్టణంలో ఏకంగా బాహుబలి సినిమా రికార్డులనే గల్లoతయ్యేలా చేసింది.

కోలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ సినిమా టాక్ ఎలా ఉన్నా వసూళ్లకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. అదే మరోసారి వివేగం సినిమాకు ప్రూవ్ అయ్యింది. చెన్నైలో ఈ సినిమా నాలుగురోజుల కలక్షన్స్ తో అదిరిపోయే రికార్డ్ సొంతం చేసుకుంది. దేశం మెచ్చిన సినిమా బాహుబలి చెన్నైలో నాలుగు రోజుల్లో 3.24 కోట్లు వసూలు చేయగా.. ఇళయదళపతి విజయ్ నటించిన భైరవ 3.09 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఇక ఈ రెండిటి రికార్డులను చెరిపేస్తూ అజిత్ వివేగం నాలుగు రోజుల్లో 5.20 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.

చెన్నై పట్టణంలో నాలుగు రోజుల్లో ఈ రేంజ్ కలక్షన్స్ సాధించిన మొదటి సినిమా వివేగం కాగా మొదటి హీరో అజిత్ అని అంటున్నారు. సినిమా హాలీవుడ్ రేంజ్ లో తీసినా రొటీన్ సబ్జెక్ట్ అవడం వల్ల సగటు ప్రేక్షకుడికి అంతగా నచ్చలేదు. అయినా సరే ఫ్యాన్స్ ఈ సినిమాను నడిపిస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా కాబట్టి ఫుల్ రన్ లో లాసులే తెచ్చేలా ఉందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news