Moviesసంచలనం సృష్టిస్తున్న 'రెండు రెళ్లు ఆరు'.. ప్రీమియర్ షో టాక్ అదుర్స్

సంచలనం సృష్టిస్తున్న ‘రెండు రెళ్లు ఆరు’.. ప్రీమియర్ షో టాక్ అదుర్స్

కలను సాకారం చేసుకునే క్రమంలో దర్శకుడిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకునే వారు చాలా తక్కువమందే అని చెప్పాలి. తమలో ఉన్న టాలెంట్ గుర్తించి సరైన అవకాశం వస్తే దాన్ని అన్నివిధాలుగా వాడుకోగలిగితేనే సక్సెస్ అయినట్టే. ఇకా వారు తీసేవి చిన్న సినిమాలే అయినా నచ్చితే వాటికే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టిస్తున్న చిన్నసినిమాలు స్టార్ సినిమాలకు కూడా షాక్ ఇస్తున్నాయంటే నమ్మాలి.

లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ అయిన స్టార్ సినిమాల కన్నా బ్లాక్ బస్టర్ అయిన చిన్న సినిమాలు ఉన్నాయి. ఇక అదే క్రమంలో ఈ ఇయర్ చిన్న సినిమాల్లో ప్రభంజనం సృష్టించబోయే సినిమాగా వస్తుంది ‘రెండు రెళ్లు ఆరు’. నందు మల్లెల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అనీల్, మహిమా హీరో హీరోయిన్స్ గా నటించారు. జూలై 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సిని ప్రముఖులకు ప్రీమియర్ షో చూపించడం జరిగింది.

కొత్త కథ దానికి తగ్గట్టుగానే కథనం చక్కగా కుదిరిన ఈ సినిమా ప్రీమియర్ షో నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. డే డ్రీం ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించబడిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలనచిత్ర బ్యానర్లో రిలీజ్ చేస్తున్నారు. సీనియర్ యాక్టర్ నరేష్ ఇందులో ఇంపార్టెంట్ రోల్ చేశారని తెలుస్తుంది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది. మరి ప్రీమియర్ షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news