Newsఎన్టీఆర్ షో లో ఆ అమ్మాయి లేకపోతే ఎలా.. ?

ఎన్టీఆర్ షో లో ఆ అమ్మాయి లేకపోతే ఎలా.. ?

ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందు లీకైన సమాచారంలో కూడా తేజస్వి పేరు వుంది. కానీ ఫైనల్ జాబితాకు వచ్చేసరికి తేజస్వి రాకపోవడం షాక్ అవ్వడం వీక్షకుల వంతయ్యింది. లీకైన సమాచారంలో ఒక్క తేజస్వి తప్ప, మిగతా వారంతా బిగ్ బాస్ హౌస్ లో ఉండగా, ఈ హాట్ బ్యూటీ స్థానంలో ‘బస్టాప్’ ఫేం హీరో ప్రిన్స్ వచ్చి చేరారు. అసలే ఈ షోలో పాల్గొనే వారంతా ఫేడ్ అవుట్ అయిన భామలని ప్రేక్షకులంతా నిరుత్సాహపడగా, తేజస్వి కూడా దూరం కావడంతో ఆ అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది.

ఇక, ఆదివారం నాడు ,సోమవారం నాడు ప్రసారమైన ఫస్ట్ రెండు ఎపిసోడ్ ల షో వీక్షకులను ఆకట్టుకుంది. ఈ షోలో ఎవరెవరు ఉంటారనే ఆసక్తి ఒకటి కాగా, బుల్లితెరపై యంగ్ టైగర్ ఎలా అభినయిస్తారో అన్నది ప్రేక్షకులకు అత్యంత ఆసక్తికరంగా మారాయి. సెలబ్రిటీల విషయంలో నిరుత్సాహం వ్యక్తమైనా, సమయస్పూర్తితో కూడిన తారక్ నటనా విన్యాసం మాత్రం ఆకర్షించిందనే చెప్పాలి. అయితే ఈ షోకు నిజమైన ప్రేక్షకుల ఆదరణ ఉందనేది మాత్రం తెలియాలంటే, కనీసం ఒకటి, రెండు వారాలు గడవాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news