Newsఅవును ఇది నిజం: పాల కన్నా బీరే మిన్న

అవును ఇది నిజం: పాల కన్నా బీరే మిన్న

పాల కంటే బీరు ఆరోగ్యకరం. చదవటానికి షాకింగా ఉన్నప్పటికీ మీరు చదివింది మాత్రం నూటికి నూరుపాళ్లు నిజమే.వేరెవరో కాదు జంతు పరిరక్షణ కోసం పాటుపడుతున్న ‘పెటా’ ఈ ప్రకటన చేసింది. అంతేకాదు ఈ విషయం శాస్త్రీయంగా రుజువైందని కూడా వెల్లడించింది. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ-మాడిసన్ క్యాంపస్ కు కూత వేటు దూరంలో ఉండే హిల్ డేల్ మాల్ వద్ద ‘గాట్ బీర్’ పేరుతో బిల్ బోర్డును పెటా ఏర్పాటు చేసింది. పాలు తాగడం కంటే బీరు సేవించడం ఆరోగ్యానికి మంచిదని అధికారికంగా నిర్ధారణయిందని అందులో పేర్కొంది.

పాలతో పోలిస్తే బీరు బలవర్ధక ఆహారమని వివరించింది. పాలు మరియు బీరు రెండింటిలోనూ ఉన్న పోషకాలను పోల్చిచూపింది. బీరు ఎముకల పటుత్వాన్ని పెంచి ఆయుర్ధాయం పెంచుతుందని తెలిపింది. పాలు తాగడం వలన ఒబెసిటీ, డయాబెటీస్, కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. పాల ఉత్పత్తులు వాడడం వల్ల ఎముకలు గుల్లబారే ప్రమాదముందని కూడా హెచ్చరించింది. ‘పాలు తాగడం మానండి, బాధ్యతగా బీరు తాగండి’ అని ప్రకటనలో పేర్కొంది. గతంలోనూ బీరుకు మద్దతుగా పెటా ప్రచారం చేసింది. 2000 సంవత్సరంలోనే బీరుకు మద్దతుగా పెటా ప్రచారం చేసింది. అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పట్లో పెటా వెనక్కు తగ్గింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news